![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -643 లో.... ఆస్తుల గురించి మనం అడగాలని ప్రకాష్ కళ్యాణ్ లకి ధాన్యలక్ష్మి చెప్తుంది ఇప్పుడున్న పరిస్థితి ఏంటి మీరు ఆలోచించేది ఏంటని కళ్యాణ్ అంటాడు. దాంతో ధాన్యలక్ష్మి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నేను మా అన్నయ్య దారిలో నడిచి తప్పు చేసానని ఫీల్ అవుతున్నాను.. నువ్వు అలాగే చేస్తున్నావ్.. ఆ తప్పు చెయ్యకు అని కళ్యాణ్ తో ప్రకాశ్ చెప్తాడు. మరొకవైపు రుద్రాణి, రాహుల్ లు స్వప్న దగ్గరికి వచ్చి తనని రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తారు. ఇంట్లో సిచువేషన్ చూస్తున్నావ్ కదా కావ్య అప్పు చేసింది.. అది తీర్చడానికి అన్ని ఆస్తులు అమ్ముతారు.. మా నాన్న నీకు ఇచ్చిన ఆస్తి కూడా అమ్ముతారని స్వప్నతో రుద్రాణి చెప్పి వెళ్ళిపోతుంది.
దాంతో స్వప్న ఆలోచనలో పడుతుంది. ఇందిరాదేవి హాస్పిటల్ లో ఉన్న సీతారామయ్య దగ్గరికి వెళ్లి ఇంట్లో జరుగుతున్న సంఘటనలు చెప్తుంది. మరొకవైపు అప్పు స్టేషన్ కి వెళ్తుంది. అక్కడ తనదైనా స్టైల్ లో ఇంటరాగేషన్ చేసి దొంగని కనిపెడుతుంది. దుగ్గిరాల ఇంటికి బ్యాంకు వాళ్ళు వస్తారు. ఇంటిని జప్తు చేస్తున్నామని వాళ్ళు అంటారు. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మి లు రెచ్చిపోతారు. అప్పు చేసి కోట్ల డబ్బులు అన్ని మీ వాళ్లకు ఇచ్చావా అవన్నీ తీసుకొని వచ్చి అప్పు కట్టమని రుద్రాణి అనగానే.. నా కోడలు కొడుకు ఏ అప్పు చెయ్యలేదు.. ఆఫీసర్స్ మా వాళ్ళు అప్పు చేసారా అని సుభాష్ అడుగగా.. లేదని వాళ్ళు చెప్తారు. జరిగింది మొత్తం సుభాష్ అందరికి చెప్తాడు. నాన్నగారు ఇచ్చిన మాట పోకూడదని వాళ్ళు ఇలా చేశారని సుభాష్ చెప్తాడు. దాంతో అపర్ణ గిల్టీ గా ఫీల్ అవుతూ.. నాతో పాటు అందరం వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నామని అంటుంది. మీరు ఏమైనా చేసుకోండి నాకు ఆస్తిలో వాటా కావాలని ధాన్యలక్ష్మి అడుగుతుంది.
ఇంట్లో అందరు దాని గురించి డిస్కషన్ చేస్తుంటారు. రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరు మాత్రం ఎవరు ఎంత చెప్పినా వినరు. అప్పుడే సీతారామయ్య, ఇందిరాదేవిలు వస్తారు. తరువాయి భాగంలో తాతయ్య గారు సంపాదించిన ఆస్తి ఎవడో మోసం చేస్తే వదులుకోవాల్సి వస్తుందని రాజ్ తో కావ్య అంటుంది. అప్పుడే శృతి వచ్చి.. మేడమ్ మన స్టాలు రెడీ అయింది ఒకసారి పంపించాను చూడండి అని అంటుంది. కావ్య ఓపెన్ చేసి చూస్తుంటే అందులో నందగోపాల్ ఫోన్ మాట్లాడుతూ కన్పిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |